హిందువులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

6
- Advertisement -

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరిగిన వివాదం నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏం జరిగిందో తెలియకుండానే, ఎలాంటి విచారణ లేకుండానే చంద్రబాబు నాయుడు పందికొవ్వు ఉందని ఎలా మాట్లాడారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. అయోధ్యకు పంపిన లడ్డూల్లోనూ ఏదో ఉందని సనాతని పవన్ కళ్యాణ్ ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదేనా హిందువులకు వీళ్లు ఇచ్చే గౌరవమని ప్రశ్నిస్తూ, నిజానిజాలు తెలుసుకోకుండా గాలి మాటలు ప్రచారం చేసి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని మండిపడ్డారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సీబీఐ సిట్ నివేదికలో స్పష్టంగా తేలిన నేపథ్యంలో, తిరుమలలో వైసీపీ శ్రేణులు వినూత్నంగా నిరసన చేపట్టాయి. అలిపిరి వద్ద శ్రీవారి మెట్లను కడుగుతూ “లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేసిన వాళ్లను క్షమించు గోవిందా” అంటూ నినాదాలు చేశారు. “గోవిందా.. గోవిందా” అంటూ భక్తి భావంతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కొండను రాజకీయాలకు వాడుకుంటున్న నీచులను మన్నించు గోవిందా అంటూ నినాదాలు చేస్తూ, లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసి శ్రీవారి భక్తులు, హిందువుల మనోభావాలను కించపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి చెంత క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Also Read;మరోసారి బంగారం భగభగ

- Advertisement -