వైసీపీ నేని, మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన నాని..రెండు సార్లు తనను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ ప్రజలకు సేవ చేయడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నానని…తాను రాజకీయ రంగానికి దూరమవుతున్నప్పటికీ విజయవాడ అభివృద్ధి పట్ల తన నిబద్ధత ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. విజయవాడకి తాను చేయగలిగినది చేస్తూనే ఉంటానని…తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.
Also Read:సహజ సిద్ధమైన యాంటి బయోటిక్స్..
After careful consideration and reflection I have decided to step away from politics and conclude my political journey.
Serving the people of Vijayawada as a Member of Parliament for two terms has been an incredible honor. The resilience and determination of the people of… pic.twitter.com/nlcWFoAdAH— Kesineni Nani (@kesineni_nani) June 10, 2024