బీజేపీలో చేరిక.. నాని క్లారిటీ!

6
- Advertisement -

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు మాజీ ఎంపీ కేశినేని నాని. విజయవాడ నంఉడి రెండు సార్లు ఎంపీగా గెలిచిన నాని.. గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఆయన తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొద్దిరోజులుగా నాని.. బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు నాని. జనవరి 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాను…. ఆ నిర్ణయం మారదు అని తేల్చిచెప్పేశారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు నాని.

ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్దత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని ..విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేస్తాను స్పష్టం చేశారు. నా రాజకీయ పునరాగమనానికి సంబంధించి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పారు కేశినేని నాని.

ALso Read:తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు

- Advertisement -