పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా కేకే…

597
keshavarao
- Advertisement -

పార్లమెంటరీ స్థాయీ సంఘాలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా జాబితా ప్రకటించారు. పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా టి .ఆర్ .ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె .కేశవ రావు నియమితులయ్యారు .ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు .

ఈ కమిటీ లో 21 మంది లోక్ సభ సభ్యులు ,పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు .ప్రతిష్టాత్మక కమిటీ కి తనను చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల కె .కేశవ రావు హర్షం వ్యక్తం చేశారు .అసెంబ్లీ ఆవరణలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు ని కలిసిన కె .కె . పరిశ్రమల పై పార్లమెంటరీ స్థాయి సంఘానికి తనను చైర్మన్ గా ఎంపిక చేసిన విషయాన్ని తెలియజేశారు .సీఎం కెసిఆర్ కేశవ రావు కు శాలువా కప్పి అభినందనలు తెలియ జేశారు .

హోమ్ అఫైర్‌ ఆనంద్ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఎంపీ రాములు చోటు దక్కించుకున్నారు. శాస్త్ర, సాంకేతిక, పర్యావరణం, అడవులు పై జైరాం రమేష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు.

- Advertisement -