నిఖిల్ ఇప్పుడు లక్కీ హీరో అయిపోయాడు. ఈ యువహీరో నటించిన ‘కేశవ’ బ్రహ్మాండమైన వసూళ్ళ ని సాధిస్తోంది. నిజానికి ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రభంజనం ముందు తెలుగు సినిమాలే కాదు.. వేరే భాషల చిత్రాలు కూడా తట్టుకోలేకపోతున్న టైంలో థియేటర్లలోకి దిగింది ‘కేశవ’.
ఈ సినిమా రిలీజయ్యే ముందు వీకెండ్లో కూడా బాహుబలి-2 అదరగొట్టింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఉనికిని చాటుకోవడం ‘కేశవ’కు అంత సులువేమీ కాదన్నారు ట్రేడ్ పండిట్స్. కానీ ..ఇప్పుడు ఆ సినీ పండితులకే షాక్ ఇస్తోంది కేశవ.
ఈ చిన్న సినిమా బాహుబలి-2 ప్రభంజనాన్ని తట్టుకుని బాగానే నిలిచిందని చెప్పాలి. కేశవ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి కొంత గ్రాఫ్ తగ్గింది అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్లో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ తో రన్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి.. ఆశ్చర్యపరిచింది. వీకెండ్ తర్వాత కూడా ‘కేశవ’ పట్టు నిలుపుకుంది. తొలి వారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
మొదటి వారంలోనే 16 కోట్లు వసూల్ కావడంతో ఆ చిత్ర యూనిట్ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు . నిఖిల్ మొదటిసారి సీరియస్ రోల్ చేసి మెప్పించాడు . రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మించగా సుదీర్ వర్మ దర్శకత్వం వహించాడు .
పెద్ద నోట్లు రద్దు అయి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి వసూళ్ళ ని రాబట్టాడు నికిల్. మొత్తానికి కేశవతో నిఖిల్ రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.