వరుడు కావాలి… ఫేస్‎బుక్‎లో యువతి పోస్ట్ వైరల్…

922
- Advertisement -

నాకు వదువు కావలెను, వరుడు కావలెను అని మ్యాట్రిమోని వెబ్‎సైట్లలో, పేపర్లలో పెళ్లి ప్రకటనలు ఇస్తుంటాం. లేదంటే బ్రోకర్ని సంప్రదించి వెతికి పెట్టమని చెబుతుంటాం. కానీ కేరళకు చెందిన ఓ యువతి మాత్రం కొత్త వేదికను ఎంచుకుంది. సాధారణంగా ఫేస్‎బుక్ తమ వ్యక్తి గత అనుభవాలను, భావాలను ఫోటోలను పంచుకోవడానికి ఉపయోగిస్తుంటారు. కానీ అమ్మాయి ఆ ఫేస్‎బుక్ నుంచి తన భాగస్యామిని వెతుక్కోవడానికి ఉపయోగిస్తుంది.

Kerala Woman’s Facebook Matrimony Post Goes Viral

అసలు విషయానికి వస్తే కేరళ చెందిన మల్లప్పురం నగరానికి చెందిన జ్యోతి అనే యువతి గతవారం తన పెళ్లి ప్రకటన పోస్టు చేసింది. ‘‘ఫేస్‌బుక్‌మ్యాట్రిమోనీ’’ హ్యాష్‌ట్యాగ్‌తో తనకు తగిన వరుడిని చూసిపెట్టాలంటూ మిత్రులను కోరింది. తనకు కులం, జాతకాలతో పట్టింపులేదని… ఎలాంటి డిమాండ్లు కూడా లేవని ఆ పోస్టులో పేర్కొంది. ఇప్పుడు ఆ పోస్టు విపరీతంగా
వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆమెకు చాలా మంది ప్రపోస్ కూడా చేశారు. ఆ పోస్టును ఇప్పటి వరకు 6 మందికిపైగా షేర్ చేశారు.

నేను ఒక్కదాన్నే ఉంటా, నా తల్లిదండ్రులు చనిపోయారు. నా సోదరుడు ముంబైలో సీనియర్ ఆర్ట్ డైరెక్టర్‎గా పనిచేస్తున్నారు. నా చెల్లెలు సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. నా వయసు 28 సంవత్సారాలు, ఫ్యాషన్ డిజైనింగ్ లో బీఎస్పీ చేసాను. మీకు ఎవరైనా తెలిసిన మిత్రులుంటే చెప్పండి. నాకు ఎలాంటి డిమాండ్లూ లేవు, జాతకాలు, కులం, గోత్రం కూడా ముఖ్యం కాదు అంటూ ఆమె తన ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటనలో తన ఫోటోను కూడా పోస్టుకు జతచేసింది. పనిలో పనిగా ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్‎ని కూడా ఓ రిక్విస్ట్ చేసింది. పెళ్లి బ్రోకర్లు, మ్యాట్రిమోనీ సైట్ల మోసాల నుంచి యువతను కాపాడేలా.. ఫేస్‎బుక్‎లో మ్యాట్రిమోనీ ఆప్షన్ పెట్టాలని కోరింది.

- Advertisement -