కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడి 60 మందికి పైగా మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండ చరియలు విరిగి పడటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కేరళలో కొద్దిరోజులుగా ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోండగా చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల తాకిడికి వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి మెప్పాడి, ముండక్కై టౌన్, చూరల్‌మాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బురద ప్రవాహం పలు గ్రామాలను ముంచెత్తింది.
ఉరుట్టిలో కొత్తగా నిర్మించిన వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది. అక్కడ బురద నీటితో కూడిన వరద ఉప్పెలా విరుచుకుపడటం కనిపించింది. ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారికి ఆర్ధిక సాయం ప్రకటించారు ప్రధాని.
Also Read:TTD: ఆగస్టు 1 నుండి శ్రీవారి పుష్కరిణి మూత