నర్స్ లివి సేవలకు ప్రభుత్వం గుర్తింపు..

248
Kerala Government Help To nurse Lini family
- Advertisement -

ప్రస్తుతం కేరళలో నిఫా వైరస్ అందరిని వణికిస్తోంది. అయితే నిఫా వైరస్ సోకిన వాళ్లకు సేవలందిస్తూ నర్స్ లివి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సేవలకు మెచ్చిన ప్రభుత్వం ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. ఆ కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం అందించింది. అంతేకాకుండా, ఆమె భర్త కేరళలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పింది.

Kerala Government Help To nurse Lini family అలాగే నిఫా వైరస్ భారిన పడి మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వనుంది. నర్సుగా సేవలందించిన లివి నిఫా వైరస్ భారిన పడి సోమవారం మృతి చెందారు. మరణించే ముందు ఆమె తన భర్తకు ఫేస్ బుక్ ద్వారా లేఖ రాసింది. మిమ్మల్ని ఇక కలవలేను, చూడలేను, మన పిల్లలు జాగ్రత్త. వాళ్లను మీతోపాటు తీసుకెళ్లండి అంటూ రాసిన లేఖ అందరిని కంటతడి పెట్టిస్తోంది.

మరోవైపు నిఫా వైరల్ వల్లన ఇప్పటికే 11 మంది మృతి చెందారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం అందిస్తోన్న సహకారంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఈ ప్రాణాంతకమైన  వైరస్ కర్ణాటకకు చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ 20 ఏళ్ల యువతికి, 70 ఏళ్ల వృద్ధుడికి నిఫా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. మంగళూరుకు చెందిన వీళ్లు కొన్ని రోజులు కేరళలో ఉన్నారని, నిఫా వైరస్ సోకిన వాళ్లతో ఉండడం వల్ల ఈ  లక్షణాలు కనిసిస్తున్నాయని బీవీ రాజేష్ అనే ఓ అధికారి తెలిపారు. వీళ్లను ఆస్పత్రికి తరలించామని, వారి రక్త నమూనాలను మణిపాల్ సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చికి పంపించామని, గురువారంలోగా వీటి ఫలితాలు వస్తాయని ఆ అధికారి వెల్లడించారు.

- Advertisement -