ప్రజలందరికి మంచి జరగాలి: కేజ్రీవాల్

2
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో సతీసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అరవింద్ కేజ్రీవాల్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…..ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..దేశప్రజల అందరూ బాగుండాలని దేవుడిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలు బాగా చదువుకోవాలని,వారికి మంచి జరగాలని కోరుకున్నా అన్నారు.

ఆప్ పార్టీ స్థాపించిన తర్వాత మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేజ్రీవాల్. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్…. బెయిల్ పై బయటవచ్చి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని సీఎంగా చేశారు.

Also Read:Harish:ప్రజా తిరుగుబాటును తప్పించుకోలేరు

- Advertisement -