- Advertisement -
సీఏఏతో దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(CAA)ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సీఏఏతో దోపిడీలు, అత్యాచారాలు, అల్లర్లు జరుగుతాయని తెలిపారు.
పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌లో దాదాపు 2.5 నుంచి 3 కోట్ల మంది మైనారిటీలు ఉన్నారని …అవి పేద దేశాలని.. దాదాపు 1.5 కోట్ల మంది భారతదేశానికి వస్తారని అన్నారు. వారిని ఎక్కడ ఉంచుతారని ప్రశ్నించారు. వారికి మనం ఎలా ఉద్యోగాలు ఇస్తామని నిలదీశారు. మన ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలు వారికి వెళ్తాయని..వీటన్నింటికి ఏ విధంగా పరిష్కారం చూపుతారన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల వేళ బీజేపీ తమ మ్యానిఫెస్టోలో సీఏఏను చేర్చింది.
Also Read:టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ దూరం?
- Advertisement -