మెగా ఫోన్ పట్టనున్న కీర్తి!

7
- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీత, నటి కీర్తి సురేష్ సినిమా నిర్మాణం, దర్శకత్వంపై తన ఆసక్తిని వెల్లడించింది. భవిష్యత్‌లో తాను దర్శకురాలిగా మారుతానని వెల్లడించింది. గత అయిదేళ్లుగా తాను నిరంతరం కొత్త కథల ఆలోచనలను నోట్‌చేసుకుంటూ వస్తున్నానని కీర్తి చెప్పింది.

ప్రయాణాలు తనకు ఆలోచించడానికి అవసరమైన స్పష్టతను, ప్రశాంతతను ఇస్తాయని, ఆ సమయంలో వచ్చే కాన్సెప్ట్‌లను భవిష్యత్తులో సినిమాల రూపంలో తీసుకురావాలని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు.

భారతీయ సినిమా రంగంలో అగ్రగామి నటిగా కొనసాగుతున్న కీర్తి, ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేయాలనే ఆలోచన అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read:కర్ణాటక..బ్రేక్‌ఫాస్ట్ పాలిటిక్స్

- Advertisement -