ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళం..!

317
- Advertisement -

కీసర రెవెన్యూశాఖలో భారీ అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్‌ ఇవ్వడం కోసం ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్‌ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్‌ రూ.2 కోట్ల లంచం డిమాండ్‌ చేయగా మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తహసీల్దార్‌ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూశాఖలో టైపిస్ట్‌గా చేరిన నాగరాజు పదోన్నతిపై తహశీల్దార్‌గా ఎదిగాడు. మధ్యలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. తాజాగా మరోసారి నాగరాజు ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -