మరో బయోపిక్‌లో కీర్తి సురేష్‌..!

587
keerthi suresh
- Advertisement -

టాలీవుడ్ లెజెండరీ నటి సావిత్రి బయోపిక్‌లో నటించి మెప్పించింది కీర్తి సురేష్. మహానటిగా సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు మంచి గుర్తింపు రాగా తాజాగా మరో బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది.

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు హీరో నరేష్‌. హీరోయిన్‌గా దర్శకురాలిగా టాలీవుడ్‌కు ఎంతోసేవ చేశారు విజయ నిర్మల. అంతేగాదు నిజజీవితంలో కూడా ఎంతోమందిని ఆదుకున్నారు.

ఈ నేపథ్యంలో విజయనిర్మల బయోపిక్‌ని త్వరలో పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉండగా ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట నరేష్‌. మరి నరేష్‌ ప్రపోజల్‌ని కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా లేదా వేచిచూడాలి.

- Advertisement -