బ్రేకప్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

38
- Advertisement -

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్, హీరో నాని నటించిన దసరా చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వ్యూలలో సినిమాతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు కీర్తి సురేష్. ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్ చేదుగా ఉంటుందా ?.. మందు చేదుగా ఉంటుందా ? అనే ప్రశ్నకు ‘బ్రేకప్ మాత్రమే చేదుగా ఉంటుంది.’ అని కీర్తి సమాధానం ఇచ్చారు. అయితే, కీర్తి సురేష్ కామెంట్స్ పై నెటిజన్లు ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతున్నారు.

అసలు కీర్తి సురేష్ కి బ్రేకప్ చేదుగా ఉంటుంది అనే విషయం ఎలా తెలుసు ? అని ఒక నెటిజన్, మీకు తెలియదా?.. ఆమె లవ్ లో ఫెయిల్ అయ్యింది మరొకరు, అలాగే మరో నెటిజన్ తన పరిధి దాటి.. అసలు ఒక హీరోయిన్ కి బ్రేకప్ కొత్తేమీ కాదుగా అంటూ కామెంట్ చేశాడు. ఇక కీర్తి సురేష్ దసరా సినిమా గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దసరా సినిమా కోసం తెలంగాణ యాస బాగా ప్రాక్టీస్‌ చేశానని.. డబ్బింగ్‌ చెప్పే సమయానికి తెలంగాణ యాసపై పూర్తి పట్టు దొరికిందని నటి కీర్తి సురేష్ తెలిపారు.

అలాగే కీర్తి సురేష్ మీడియాతో ముచ్చటిస్తూ.. ‘ఈ చిత్రం పూర్తయిన తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యా. నా కెరీర్‌లో మరో గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది దసరా. ఈ సినిమాలో ‘చమ్కీల అంగీలేసి’ పాట చాలా పాపులర్‌ అయ్యింది. ప్రతి పెళ్లిలో ఇదే పాట మార్మోగిపోతోంది’ అని కీర్తి చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -