- Advertisement -
మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు కీర్తి సురేష్. ఇటీవలె ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి త్వరలో మిస్ ఇండియాగా అలరించనుంది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేశ్ ఎస్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్‌ను సోమవారం విడుదల చేసింది. టీజర్‌లో కీర్తి సురేశ్ నాజూకుగా, స్టైలిష్‌గా కనిపించారు. చిత్రం షూటింగ్ దాదాపు విదేశాల్లో జరిగినట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.
తమన్ సంగీతం అందిస్తుండగా జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా, సుమంత్, నదియా తదితరులు నటిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి…
- Advertisement -