పిక్ టాక్ : హాట్ హాట్ గా హోమ్లీ బ్యూటీ

74
- Advertisement -

మలయాళ హోమ్లీ బ్యూటీ ‘కీర్తి సురేష్’ అనగానే పద్దతిగా ఉంటుంది. అస్సలు బోల్డ్ సన్నివేశాల్లో నటించదు. పైగా కీర్తి సురేష్ హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి మాటలు వినిపించేవి మొన్నటివరకూ. దీనికితోడు కీర్తి సురేష్ కూడా ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయలేదు. అలాగే అనవసరమైన వివాదాలలో దూరి బూతు కామెంట్లు చేయడం లాంటివి కూడా ఎప్పుడూ కీర్తి సురేష్ చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది కీర్తి. అయితే, మొదటి నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వచ్చిన కీర్తి సురేష్ ఒక్కసారిగా ఈ మధ్య గ్లామరస్ ట్రీట్స్ ఇవ్వడం అలవాటు చేసుకుంది.

సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది కీర్తి సురేష్. గ్లామర్ రోల్స్ చేసినా ఎప్పుడూ తన అందాలను హద్దులు దాటేలా ప్రదర్శించలేదు. కేవలం నటనతోనే తన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. కానీ, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కీర్తి సురేష్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. కలర్ ఫుల్ బ్లౌజులో లెహంగాలో కీర్తి సురేష్ మెరిసిపోతూ తన సొగసుల గుమగుమలను సోషల్ మీడియాకి అద్దింది.

కీర్తి సురేష్ ఎప్పుడు ఇంత హాట్ గా కనిపించలేదు అనేంతగా ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి. కీర్తి సురేష్ ఫోటోలు చూసి నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ కూడా చిన్నగా గ్లామర్ వైపు అడుగులు వేస్తోంది అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ స్టార్ డమ్ రోజురోజుకు పడి పోతూ ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -