రేటు పెంచేసిన కీర్తి…ఎంతో తెలుసా?

176
- Advertisement -

మహానటితో దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తీ సురేష్. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించిన కీర్తి…ప్రస్తుతం భాష ఏదైనా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వరుస సినిమాలు చేతిలో ఉండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందో ఏమో గానీ రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచేసిందట.

నానితో వస్తున్న ‘దసరా’ చిత్రానికి కీర్తి సురేష్ 3 కోట్ల రూపాయలు అందుకుందట కీర్తి. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ స్వరకర్త సంతోష్ నారాయణన్ నేపథ్య స్కోర్, సంగీతం అందించబోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోండగా ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది.

- Advertisement -