ఎన్టీఆర్ 30..అప్‌డేట్

136
keerthy
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతుండగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించిన వార్త వైరల్‌గా మారింది.

ఎన్టీఆర్ సరసన మహానటి కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తారక్ – కీర్తి జోడి కథకు బాగా సెట్ అవుతారని అందుకే కొరటాల ఆమె వైపు మొగ్గుచూపారని టాక్‌. ఇక ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా.. కథ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.

తొలుత బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ తర్వాత రష్మికా మందన్న పేర్లు వినిపించిన కొరటాల మాత్రం కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారని టాక్ నడుస్తుండగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

- Advertisement -