కీర్తి సురేష్ కూడా మొదలుపెట్టింది..!

226
keerthi suresh
- Advertisement -

‘నేను శైలజ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సుందరాంగి కీర్తి సురేష్‌.. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకుంది. నాని హీరోగా వచ్చిన ‘నేను లోకల్‌’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే.

keerthy-suresh

అయితే గతంలో ఏ మూవీకి కూడా కీర్తి తనకు తాను వాయిస్ ఇచ్చుకోలేదు. కానీ తెలుగులో తొలిసారిగా కీర్తి సురేశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట.త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని చెబుతూ డ‌బ్బింగ్ రూమ్‌లో కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో స్క్రీన్‌పై ప‌వ‌న్, కీర్తి సురేష్ క‌నిపిస్తున్నారు. గ‌తంలో ప‌ర‌భాషా భామ‌లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, తాప్సి, నిత్యామేనన్‌, తమన్నా తదితరులు తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు.హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ప‌వ‌న్ 25వ‌ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ మ‌రో క‌థానాయిక‌. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న రిలీజ్‌ కానుంది.

- Advertisement -