శ్రీవారి సన్నిధిలో ‘మహానటి’..

273
Keerthy Suresh At Tirumala
- Advertisement -

తెలుగు ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లెజండరి నటి సావిత్రి బయోపిక్ మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. సావిత్రిలా నటించడంలో కీర్తి సురేశ్ మంచి మార్కులు కొట్టేసింది.

ఇప్పటివరకూ కథానాయకుల సరసన ఆడుతూ పాడుతూ అలరిస్తూ వచ్చిన కీర్తి సురేశ్, కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని నడిపించిన సినిమా ఇది. ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో వెలికి తీసిన సినిమా ఇది.అందువల్లనే ఇప్పుడు ఎక్కడ చూసినా కీర్తి సురేశ్ ప్రస్తావనే వినిపిస్తోంది.

Keerthy Suresh At Tirumala

ఇంతటి సక్సెస్ లభించిన ఆనందంలో, ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కీర్తి సురేశ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. వేదపండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి .. పట్టువస్త్రంతో ఆలయ మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. ‘మహానటి’ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందనీ, ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం వలన స్వామివారి దర్శనం కోసం వచ్చినట్టు చెప్పింది.

- Advertisement -