తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. అందానికే అసూయ పుట్టేలా ఉన్న సావిత్రి ఎన్టీఆర్- ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో ఆసరాను అందించింది. ఇప్పుడు ఆ మహానటి జీవితం ఆధారంగా ఓ మూవీ ని తీస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
ఇందులో సమంత తో పాటు కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో నటించనున్నారు. ఆ చిత్రంలో ఇప్పటికే పాత్రాలన్నింటిని సెలెక్ట్ చేసింది చిత్ర యూనిట్. సావిత్రిగా – కీర్తి సురేష్.. అలాగే సావిత్రి భర్త అయిన జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. సావిత్రి జీవితాన్ని ఒక దారిలో నడిపించిన ఓ వ్యక్తి పాత్రకు విలక్షణ నటుడు అయిన ప్రకాశ్ రాజ్ ని సెలెక్ట్ చేశారు.
ఇంకా ఈ చిత్రంలో కీర్తి లుక్కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. దీంతో సావిత్రిగా కీర్తి ఎలా కనిపించనున్నారనే విషయంపై ఆసక్తినెలకొంది. కాగా ‘మహానటి’ సెట్లో తీసిన కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. వీటిలో కీర్తి ‘సావిత్రి’ గెటప్‌లో చాలా చక్కగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వైజయంతి మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.