క్రేజీగా ‘లోకల్‌’ జోడీ…

897
Keerthi Suresh-Nani crazy selfie
Keerthi Suresh-Nani crazy selfie
- Advertisement -

నేను శైలజ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి బాగా సుపరిచితం అయిన కీర్తి సురేష్.. ప్రస్తుతం నేను లోకల్ అనే చిత్రంలో నాని సరసన కథానాయికగా నటిస్తోంది. నేను లోకల్ అనే చిత్రంతో బిజీగా ఉన్న కీర్తి తాజాగా నానితో కలిసి ఓ క్రేజీ సెల్ఫీ దిగి అది సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కీర్తి సురేష్ మరియు నాని లుక్ కాస్త డిఫరెంట్ గా ఉండడమే కాక ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా ఇలాంటి క్రేజీ సెల్ఫీలు చాలానే ఉన్నాయంటూ కీర్తి చెప్పింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేను లోకల్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తోండగా, డిసెంబర్ 23న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్నట్టు సమాచారం.

keerthi-selfir1

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్.. శివకార్తీయన్‌తో కలిసి నటించిన రెమో సినిమా ఈ నెల 25న ప్రేక్షకులముందుకు రానుంది. డాక్టర్ అయిన తన ప్రియురాలి ప్రేమను గెలుచుకోవడానికి నర్స్ వేషంలో కథానాయకుడు చేసిన ప్రయత్నాలేమిటి? ఈ క్రమంలో జరిగిన సంఘటనలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం.

- Advertisement -