స్లిమ్ లుక్ లోకి కీర్తి సురేష్

18
- Advertisement -

టాలీవుడ్ కి బొద్దు గుమ్ముగా పరిచయమై స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని ఏలిన కీర్తి సురేష్ ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కరోనా సమయంలో కూడా నటనకు ఫుల్ స్టాప్ పెట్టకుండా సినిమాల్లో నటిస్తూనే ఉంది కీరి సురేష్. ఆ తర్వాత కూడా కీర్తి సురేష్ బిజీగానే కనిపించింది. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ కి సినిమాలు తగ్గాయి. ఈ క్రమంలో బొద్దుగా మారిన కీర్తి సురేష్ మొదటి నుంచి ఫిట్ నెస్ విషయంలో పెద్దగా కండిషన్స్ పెట్టుకోలేదు.

ఐతే, అవకాశాలు తగ్గాక, కీర్తి సురేష్ లో మార్పు వచ్చింది. చాలా పర్ఫెక్ట్ గా మారడానికి కీర్తి సురేష్ ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా తన ఫిగర్ ని కాపాడుకుంటూ కష్టపడి వర్కౌట్స్ చేస్తోందట. శరీరంలో వచ్చిన మార్పులని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగకుండా.. మళ్లీ హీరోయిన్ గా స్లిమ్ అయ్యి, ఫామ్ లోకి రావడానికి కీర్తి సురేష్ తెగ ఆరాట పడుతుంది. అయితే ఇప్పుడు ఆ బొద్దు గుమ్మ కాస్తా పూర్తిగా స్లిమ్ లుక్ లోకి షిఫ్ట్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ తల్లితండ్రులతో సరదాగా గడిపిన కీర్తి సురేష్ సోషల్ మీడియాలో సరికొత్త ఫోటో షూట్ షేర్ చేసింది. బ్లాక్ మోడరన్ డ్రెస్సుతో స్లిమ్ గా అందంగా కనిపించింది కీర్తి సురేష్. అది చూసిన వారు కీర్తి సురేష్ బాగా స్లిమ్ గా ఉంది, కొత్త హీరోయిన్ ను చూస్తున్నట్టే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ లో చాలా మార్పులు వచ్చాయి.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -