సావిత్రికి మరో రూపం కీర్తి సురేష్..?

1205
savitri-
- Advertisement -

తెలుగు సినిమాలో మ‌ర్చిపోలేని అందం సావిత్రిది. ఆమె జీవిత‌మే సినిమా క‌థ‌ను త‌ల‌ద‌న్నేలా ఉంటుంది. ప్రేమ పెళ్లి మ‌ర‌ణం అన్నీ మిస్ట‌రీలే. అందుకే సావిత్రి జీవిత‌మే క‌థ‌గా మ‌హాన‌టి సిద్ధ‌మ‌వుతోంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రిగా న‌టిస్తోంది. కీర్తి సురేష్‌కి ఏ అర్హ త ఉంద‌ని సావిత్రిగా చేస్తోందంటూ ఇప్ప‌టికే చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటికి కీర్తి కూడా గ‌ట్టిగానే స‌మాధాన‌మిస్తూ వ‌చ్చింది. అచ్చం సావిత్రి లాగే ఉన్న కీర్తి సురేష్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

keerthi suresh

ఇందులో అలనాటి అందాలతార సావిత్రిని తలపించేలా ఉన్న కీర్తి సురేష్ ప్రియదర్శిని పేటికను చూస్తూ దర్శనమిస్తోంది. ఇప్పుడున్న హీరోయిన్ల‌లో సావిత్రి ఫేస్ క‌ట్ ఉన్న హీరోయిన్ కీర్తి సురేషే. అందుకే నాగ అశ్విన్ ఏరి కోరి మ‌రీ ఆమెనే ఎంచుకున్నాడు. అచ్చం సావిత్రిలా ఉన్న‌కీర్తి ఫోటోకి స‌మంత చాలా బాగుంది అనే కామెంట్ పెట్టింది.

keerthi suresh

కారెక్టర్ల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్న నాగ్ అశ్విన్.. కీర్తి సురేష్‌ని అచ్చం సావిత్రిలాగే మలిచేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా లుక్స్ ఆకట్టుకున్నాయి. చిత్రంలో మ‌ధుర వాణి పాత్రని స‌మంత పోషించ‌గా, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఎల్వీప్ర‌సాద్‌గా అవ‌స‌రాల, కేవి రెడ్డిగా క్రిష్ క‌నిపించ‌నున్నారు. అయితే లుక్ పరంగా సావిత్రిని గుర్తుకి తెస్తున్న‌ కీర్తి సురేష్, అసమాన్య నటనతో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రిలా నటించి మెప్పించగలదా లేదా అనేది సస్పెన్స్ .

Keerthy-Suresh

- Advertisement -