- Advertisement -
మహానటితో దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తీ సురేష్. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించిన కీర్తి…ప్రస్తుతం భాష ఏదైనా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా రంగ్‌దే మెప్పించిన ఈ బ్యూటీ.. ఈ మూవీ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది.
రంగ్ దే మూవీతో పాటు తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆసక్తిరర ముచ్చట్లను చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కీర్తి స్పందించారు. తనకే తెలియకుండా సోషల్ మీడియాలో పలుసార్లు పెళ్లి చేశారని తెలిపింది కీర్తి. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని… పెళ్లి చేసుకొనే సమయమంటూ వస్తే.. మానవత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని కీర్తి చెప్పుకొచ్చింది.
- Advertisement -