బాలీవుడ్‌కి మహానటి!

17
- Advertisement -

మహానటి సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. టాలీవుడ్ కి బొద్దు గుమ్ముగా పరిచయమై స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది కీర్తి. తన నటనకు గాను ఉత్తమ జాతీయ నటి అవార్డును సైతం అందుకుంది.

అయితే మహానటి తర్వాత దసరా ఒక్క సినిమాతో సక్సెస్ కొట్టినా ఆ తర్వాత పెద్దగా హిట్లు లేవు. ప్రస్తుతం కోలీవుడ్‌లో మూడు సినిమాలతో బిజీగా ఉంది. రఘుతాత,రివాల్వర్‌ రీటా,కన్నివేడి సినిమాల్లో నటిస్తోంది.

ఇక తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది కీర్తి సురేష్. వరుణ్ దావన్‌ బేబీ జాన్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అట్లీ కథ అందించిన ఈ మూవీకి కలీస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్‌తో మరో సినిమా ఆఫర్ వచ్చేసింది. టాలీవుడ్‌ నుండి ఎందరో హీరోయిన్లు బీ టౌన్‌లో అడుగుపెట్టిన అంతగా సక్సెస్ సాధించలేకపోయారు. మరి కీర్తి సురేష్ అయినా రాణిస్తుందా వేచిచూడాలి.

Also Read:TTD:వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

- Advertisement -