కే‌సి‌ఆర్ పథకాలే దిక్కు అంటున్న బీజేపీ !

91
- Advertisement -

తెలంగాణలో బీజేపీ పూర్తిగా డీలా పడిందా ? నిన్న మొన్నటి వరకు అధికారం తమదే అని జబ్బలు చరిచిన కమలనాథులు ఇప్పుడు పార్టీని బలపరచుకునే పనిలో పడ్డారా ? తెలంగాణలో బీజేపీకి అధికారం వచ్చే సీన్ లేదని కాషాయ నేతలు ఫిక్స్ అయ్యరా ? అంటే అవుననే సమాధానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలు కావడమే. కర్నాటక ఎన్నికల్లో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉన్నప్పటికి ఓటమి తప్పలేదు. దీంతో ఆ ప్రభావం తెలంగాణపై కూడా గట్టిగానే పడింది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కూడా తమదే విజయం అని చెప్పిన కమలనాథులు.. ఇప్పుడు ఆ మాట చెప్పడానికి సంకోచిస్తున్నారు..

ఎందుకంటే బిజెపి ఎంతో బలంగా ఉన్న కర్నాటకలోనే ఓటమిపాలు కావడంతో ఇక తెలంగాణలో విజయం అనేది దాదాపు అసాధ్యమే అని భావనకు బీజేపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది కాషాయ పార్టీ. అందులో భాగంగానే కే‌సి‌ఆర్ పథకాలపై కన్నెసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న కే‌సి‌ఆర్ సర్కార్ పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కూడా కే‌సి‌ఆర్ పాలనకే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని బి‌ఆర్‌ఎస్ నుంచి బీజేపీ వైపుకు తిప్పుకునేందుకు కాషాయ నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

Also Read: ఆ ఇద్దరి విషయంలో వీడని సస్పెన్స్?

తాము అధికారంలోకి వస్తే కే‌సి‌ఆర్ ప్రవేశ పెట్టిన ఏ పథకాన్ని కూడా రద్దు చేయబోమని.. అన్నీ కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇటీవల బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలౌతున్న అన్నీ పథకాలను అలాగే కొనసాగిస్తామని, ధరణి పోర్టల్ ను కూడా అలాగే కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే నిన్న మొన్నటి వరకు కే‌సి‌ఆర్ పాలనపై, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలపై తీవ్ర విమర్శలు చేసిన కమలనాథులు.. ఇప్పుడు ఒక్కసారిగా కే‌సి‌ఆర్ పథకాల జపం చేస్తుండడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే అదొక్కటే మార్గం అని భావించిన కాషాయ నేతలు కే‌సి‌ఆర్ పథకాలే దిక్కు అనేలా వ్యవహరిస్తున్నారు. మరి ప్రజలు బీజేపీని ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

Also Read: బి‌ఆర్‌ఎస్.. సింగిల్ గానే బరిలోకి ?

- Advertisement -