ముగిసిన కేసీఆర్ చండీయాగం…

254
kcr yagam
- Advertisement -

తెలంగాణ ప్రాజెక్టులు సకాలంలో పూర్తికావాలని,ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిర్వరామంగా కొనసాగాలని సీఎం కేసీఆర్ ఐదు రోజుల పాటు చేపట్టిన సహస్ర మహా చండీయాగం ముగిసింది. యాగంలో భాగంగా ఐదోరోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. . రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది.

ఇవాళ ఉదయం యధావిధిగా సీఎం దంపతులు మొదట రాజశ్యామలాదేవి మంటపంలో పూజలు నిర్వహించారు. నమస్తత్వమే రాజశ్యామల మాతకీ జై అంటూ వేదపండితులు చేసిన మంత్రోచ్ఛరణం మధ్య పూజలు చేశారు. అక్కడ ఋత్వికులు నిర్వహిస్తున్న పూర్ణాహుతిలో పాల్గొన్నారు.సహస్ర శీర్షా, పురుష సంవేద పుష్పమాం, పుష్ప మాలికాం సమర్పయామి, సౌభాగ్య ద్రవ్య సమర్పయామి అంటూ పూర్ణాహుతి నిర్వహించారు.

- Advertisement -