వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుని ప్రార్థించారు కేసీఆర్.
అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటారని తెలిపారు. దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణనాధుని నవరాత్రి వేడుకలు.. పల్లె నుండి పట్టణం దాకా ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నాయని అన్నారు.
వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టితత్వం మరింతగా బలపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుని కేసీఆర్ ప్రార్థించారు.
Also Read:పంచాయతీ ఎన్నికలపై అప్‌డేట్

