మళ్లీ …కేసీఆరే సీఎం:కేటీఆర్

204
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అద్భుతమని కొనియాడారు మంత్రి కేటీఆర్. తన పదేళ్ల ప్రజాప్రతినిధి అనుభవంలో అత్యంత సంతృప్తినిచ్చిన కార్యక్రమం రైతుబంధు అని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో ఉండనని చెప్పారు.

రైతు బంధు పథకం బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందంటే అది సీఎం కేసీఆర్ వలనే సాధ్యమైందన్నారు. లాండ్ సీలింగ్ ప్రకారం 54 ఎకరాలపైన భూమి ఉండటానికి వీలు లేదన్నారు. పిల్లలు, భార్య, వ్యక్తుల పేర్ల మీద ఉన్న వారికే పెట్టుబడి చెక్కులు ఇస్తున్నట్లు చెప్పారు. కంపెనీల పేరు మీద భూమి ఉంటే ఇవ్వటంలేదన్నారు.

భరత్ అనే నేను మూవీలో హీరో పేరు చివర రామ్ ఉండేలా తాను చెప్పానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు  బాగున్నాయని…అందుకే కర్నాటక కాంగ్రెస్ నేతలు ఇక్కడికి వచ్చి తలదాచుకున్నారని చెప్పారు.

రైతు బాగుంటే గ్రామీణ వాతావరణం కులవృత్తులు నేత, గీత, కమ్మరి, కుమ్మరి బాగుంటారన్నారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు. రిటర్న్ మైగ్రేషన్ ప్రారంభమైందని.. దుబాయ్, బొంబాయి వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని చెప్పారు. నీటి సమస్య అధిగమించేలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలోనే 38 వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. త్వరలోనే హరిత విప్లవం, నీలి విప్లవం(చేపల పెంపకం), పింక్ రెవెల్యూషన్(మీట్ ప్రాసెసింగ్) ,క్షీర విప్లవం నాలుగింటిపై సమగ్ర పాలసీని తీసుకురాబోతున్నామని చెప్పారు.

పెద్ద రైతు, చిన్న రైతు అంటున్న కాంగ్రెస్.. పెద్ద రైతు ఎవరు చిన్న రైతు ఎవరో లెక్కలు చెప్పాలన్నారు. పెట్టుబడికే పెడుతారు అన్న నమ్మకం ఏందని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారని.. రైతు దేనికోసం ఖర్చు చేసుకుంటే మీకేందుకన్నారు. తాము రైతులకు చేస్తున్న పెట్టుబడి సాయం ఒక్క విజయ్ మాల్య ఎత్తుకెళ్లినంత సొమ్ముకాదన్నారు. మంచి పథకాన్ని అభినందిచాల్సింది పోయి విమర్శించేందుకు సిగ్గుండాలన్నారు.

- Advertisement -