మన ఊరు మాదిరిగానే తండా ప్రణాళిక-కేసీఆర్‌

287
KCR was talking in a meeting with the Banjaras
- Advertisement -

లంబాడ ప్రతినిధులు నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజన తండాల్లో ఇక నుంచి ఎవరో కాదు.. మీరే నాయకులని సీఎం అన్నారు. గిరిజన బిడ్డల కష్టాలు ఏంటో తనకు తెలుసన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జామతండాలో ఒక రోజంతా పర్యటించినట్లు తెలిపారు. గోండులైనా, లంబాడీలైనా ఎవరి సాంప్రదాయం వారికి ఉందన్నారు. గిరిజనులకు ప్రత్యేక జీవన సరళి ఉంది.

వందశాతం గిరిజనులు ఉన్న గ్రామాల్లో ఇకపై గిరిజనులకే ప్రాతినిధ్యమన్నారు. చిన్న గ్రామ పంచాయతీకి కూడా రూ. 20 లక్షల నిధులు అందజేయనున్నట్లు చెప్పారు. తండాకే నేరుగా ఈ నిధులు వస్తాయన్నారు. ఇచ్చిన నిధులను ఉపయోగించి తండాలను అద్దాల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

KCR was talking in a meeting with the Banjaras

గిరిజనులు ఎక్కువగా ఉండే రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్‌. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో 3 వేల మంది గిరిజనులు సర్పంచ్‌లుగా ఉండే అవకాశం ఉందన్నారు. గిరిజన ఉపప్రణాళిక కింద రూ. 50 వేల కోట్లు వస్తాయి. ఐదేళ్లలో రూ.35 వేల కోట్లు ఖర్చు పెడితే గిరిజనుల్లో పేదరికమే ఉండదన్నారు. చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బడికి పంపించాలని పేర్కొన్నారు. మన ఊరు మన ప్రణాళిక మాదిరిగానే.. మన తండా- మన ప్రణాళికను తయారు చేయాలని సీఎం సూచించారు.

కేంద్రం నుంచి నరేగా, ఫైనాన్స్ డబ్బులు వస్తాయి. ఏ ఊరి సబ్‌ప్లాన్ ఆ ఊళ్లోనే తయారు కావాలన్నారు. తండాల్లో గిరిజనుల వివరాలు సమగ్రంగా తయారు చేయాలన్నారు. గట్టిగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అట్లనే కొట్లాడితే తండాలు కూడా గ్రామ పంచాయతీలైనయన్నారు. ఐదారేండ్లలోనే తెలంగాణ గిరిజనులు ధనవంతులు కావాలన్నారు. ఆడపిల్ల పెండ్లి బరువు కావొద్దనే ఉద్దేశ్యంతోనే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ప్రభుత్వం సాయం చేస్తున్నదని తెలిపారు. పేదల కష్టాన్ని ధనవంతులు ఎవరూ తీర్చరని.. పేదల కష్టాన్ని తీర్చుకునేది పేదలేనన్నారు. గొప్ప గిరిజనులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారని చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -