ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నాం రవింద్రభారతిని సందర్శించారు.రవింద్రభారతి ప్రాంతణమంతా తిరిగి సాంస్కృతిక శాఖ కార్యాలయం నిర్వహింస్తున్న బ్లాకును,పరిసర ప్రాంతాలను పరిశీలించారు.హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రవింద్రభారతిని మరింత గొప్పగా వినియోగించేందుకు చేపట్టవలసిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు.అక్టోబర్‌లో నిర్వహించే తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలకు తగిన విధంగా ఏర్పట్లు చేయాలని,కార్యచరణ రూపొందించాలని చెప్పారు.
తెలుగు భాషను కాపాడేందుకు,తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేయాలని చెప్పారు. గ్రామం నేపథ్యంలో తెలంగాణ కవులు రాసిన కవితలతో కూడిన “తల్లివేరు” కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి,ప్రభుత్వ సలహాదారు రమణాచారి,సి.ఎస్.పి.సింగ్,సాహిత్య అకాడమి చైర్మర్ నందిని సిధారెడ్డి,మామిడి హరికృష్ణ,బుర్ర వెంకటేశం,క్రిస్టియనా,దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్లొన్నారు