సిరిసిల్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు:కేసీఆర్

213
KCR visit Siricilla district
- Advertisement -

చేనేత కార్మికులకు చేయూతనందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌, పోలీస్ ఆఫీసు,కోర్టు భవనాలు,అపారల్ పార్కు భవనాలకు శంకుస్ధాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్న సీఎంకు వేములవాడ ఆలయ అర్చకులు  ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడటం…జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సముదాయాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాలను ఏర్పాటచేశామని చెప్పారు.  సిరిసిల్ల ప్రాంతం కరువుతో బాధపడ్డ ప్రాంతమని గుర్తుచేశారు. ఆనాడు భూదాన్ పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీగా వారికుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేశామని తెలిపారు.

130 కోట్లతో ఎత్తిపోథల పథకానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. 211 గ్రామపంచాయతీల అభివృద్ది కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తామన్నారు.కొత్తగా ఏర్పడిన నాలుగు మండలాలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో బిడీకార్మికులకు వెయ్యిరూపాయలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటిస్ధానంలో ఉందన్నారు. చేనేత,పవర్ లూమ్ కార్మికులను ఆదుకునేందుకు వెయ్యి కోట్లు కేటాయించామని గుర్తుచేశారు.

చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.200 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చామని  తెలిపారు. బతుకమ్మ చీరలపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేశాయని…వారికి తగిన బుద్దిచెప్పాలన్నారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు:కేటీఆర్

సిరిసిల్లను జిల్లా చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ది చేసుకుందామని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల గురించి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వివాహం కూడా వేములవాడ ఆలయంలోనే జరిగింది. కొదురుపాక అల్లుడిగా ఈ నేలతో సీఎంకు ఎనలేని అనుబంధం ఉందని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసుకుంటున్నమని..లక్షా 53వేల ఎకరాలకు 9 నెలల్లో సాగునీరు అందిస్తామని కేటీఆర్ వెల్లడించారు. రూ.1,283 కోట్లతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేని పునరుద్ఘాటించారు.

- Advertisement -