- Advertisement -
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.
అనంతరం గోల్కొండ కోటపై జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. గోల్కొండ కోటలో వెయ్యి మందికి పైగా కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. స్వతంత్ర భారత స్వర్ణోత్సవ వేళ.. భారత స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.
- Advertisement -