ఎన్నికల వేళ రైతు బంధుపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతు బంధు ఎవరికి వచ్చిందో, ఎవరికి రాలేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతుబంధు తనకే ఇంకా రాలేదు అని ఓ సమావేశంలో మాట్లాడారు. తన పక్కనే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వైపు చూస్తూ.. నాకే ఇంకా రైతు బంధు రాలేదు.. ఎందయ్యా అని భట్టి విక్రమార్కను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాక ఇస్తా అన్నాడు అని తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేసీఆర్…రైతుబంధు ఇవ్వకుండా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
It is clear with this statement of State Agriculture Minister that the Congress has betrayed farmers of Telangana by not giving Rythu Bandhu! pic.twitter.com/11xd92W8ge
— KCR (@KCRBRSPresident) April 30, 2024
ALso Read:నేటి ముఖ్యమైన వార్తలు..