హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ భవన్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇవాళ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఈరోజు శ్రావణ సోమవారం మంచిరోజు కావడంతో ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించేందుకు సిద్దమయ్యారు సీఎం. దాదాపు 80 మందికి పైగా అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ రేసులో ఉన్న ఆశవహుల్లో హై టెన్షన్ నెలకొంది.
ఇక ప్రధానంగా ఈసారి 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, ఖమ్మంలో ఇద్దరు, ఉమ్మడి వరంగల్‌లో ఇద్దరు, మెదక్, కరీంనగర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకరిని మార్చనున్నట్లు సమాచారం.
జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేదా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్యను మార్చి అక్కడ కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉప్పల్ నియోజవర్గంలో భేతి సుభాష్ రెడ్డిని తప్పించి కొత్తగా బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తారనే వార్తలు వినిపిస్తుండగా టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. తాము కలిసి పనిచేస్తామని, ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉప్పల్ సీటు కేటాయించాలని కోరగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
Also Read:Posani:నేను చనిపోతే ఆపని చేయకండి