కేసీఆర్ కోల్‌కతా పర్యటన..

243
KCR to meet Mamatha
- Advertisement -

సీఎం కేసీఆర్.. బీజేపీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే‌… ఆ దిశగా సీఎం కేసీఆర్‌ వేగం పెంచారు. అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానన్న కేసీఆర్‌… ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తొలి అడుగేశారు.. కేసీఆర్‌కు ఫోన్‌ చేసి అభినందించిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తామూ మీ వెంటే నడుస్తాని చెప్పినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఈ రోజు (మార్చి 19) న కేసీఆర్‌ కోల్‌కతా వెళ్లి మమతతో చర్చలు జరపనున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఈ రోజు భేటీ కానున్నారు. ఫ్రంట్ ఏర్పాటు ప్రకటన అనంతరం కేసీఆర్ చేస్తున్న తొలి పర్యటన ఇది. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం సీఎం కేసీఆర్ ఉదయం 11:45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా చేరుకుంటారు.

KCR to meet Mamatha

సీఎం కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఎంపీ కల్వకుంట్ల కవిత వెళ్తారు. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు వెళ్తున్నట్టు సమాచారం. మధ్యాహ్నం పశ్చిమబెంగాల్ సచివాలయంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్టుగా సమాచారం.

మధ్యాహ్నం 3:15 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సమావేశం ఉంటుంది. భేటీ అనంతరం 6:15 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి 7:40 గంటలకు కోల్‌కతా నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

- Advertisement -