- Advertisement -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు, రజతోత్సవ వేడుకల నిర్వహణపై నేతలతో చర్చించనున్నన్నారు. అలాగే కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. శాసన సభ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కూడా నేతలతో అధినేత చర్చించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 27తో పార్టీ ఏర్పాటు చేసిన 24 ఏండ్లు పూర్తవుతున్న తరుణంలో రజతోత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. ఏప్రిల్‌లో సన్నాహక సదస్సు అనంతరం 27న భారీ బహిరంగ సభ జరపనున్నారు. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Also Read:టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్
- Advertisement -

