ఢిల్లీలో సీఎం కేసీఆర్

212
KCR three day Delhi visit
- Advertisement -

మూడు రోజుల పర్యటన నిమిత్తం సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర కేబినెట్ విస్తరణ సంబంధించి  అనేక పరిణామాలు చోటు చేసుకుంటన్న తరుణంలో సీఎం  హస్తిన  పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

పర్యటనలో భాగంగా ప్రధానిని మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనుల కోసం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. ప్రధానిని కలిసి హైదరాబాద్‌లో నవంబరులో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ కూడా పాల్గొంటారు. అలాగే నవంబరులో మెట్రో రైల్‌ ప్రారంభానికి ప్రధానిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం.

అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో విశేషమేమీ లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కొంత కాలం కిందట కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటికి శస్త్రచికిత్స అవసరం అవుతుందని, అయితే కొంతకాలం తర్వాత నిర్వహించాలని అప్పట్లో వైద్యులు సూచించినట్టు చెబుతున్నారు. మరోసారి కంటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.  ఏది ఏమైనప్పటికీ ఆదివారం ఉదయం వరకు రాజకీయ సస్పెన్స్ తప్పదని తెలుస్తోంది.

- Advertisement -