ప్రజల కోసమే థర్డ్ ఫ్రంట్…

205
KCR Third Front talks with Deve Gowda
- Advertisement -

సిల్లీ రాజకీయాల కోసం థర్డ్ ఫ్రంట్ కాదని రైతులు,యువత,ప్రజలకు మంచి జరగాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. బెంగళూరులో దేవెగౌడ నివాసంలో కుమారస్వామితో కలిసి భేటీ అయిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నామని చెప్పారు.

స్వాతంత్య్రం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయని…వారి లోపభూయిష్టమైన విధానాలే వల్లే దేశం సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేకపోతున్నరు. కావేరీ జలాల సమస్యకు ఇంత వరకు పరిష్కారం దొరకలేదన్న కేసీఆర్… బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ఇప్పటి వరకు నీటి సమస్యకు పరిష్కారం చూపలేదని ప్రశ్నించారు.

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. తమది తృతీయ ఫ్రంట్ కాదని తమది ప్రజల ఫ్రంట్ అని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు దేవెగౌడ ఉద్యమానికి మద్దతిచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో కూడా దేవెగౌడ స్వయంగా పాల్గొన్నరని తెలిపారు. కర్ణాటకలో జేడీఎస్‌కు మద్దతివ్వాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

- Advertisement -