వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్

288
kcr jagan
- Advertisement -

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ను సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఇవాళ విశాఖ పట్నం ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగన్‌ పై దాడి జరిగిన ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

జగన్‌కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌ దాడి జరిగిన ఘటన, గాయం తీవ్రత, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ను తగిన విశ్రాంతి తీసుకోవాలని, జగన్‌ త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

- Advertisement -