కరెంట్ రంగంలో అద్భుతం సృష్టించాంః సీఎం కేసీఆర్

241
cmkcr
- Advertisement -

గత ఐదు ఏళ్లలోనే కరెంట్ రంగంలో అద్భుతం సృష్టించామన్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఇదే గడ్డ మీద నుంచి తెలంగాణ తెస్తా అని నేను చెప్పినా… నన్ను చాలా అవహేళన చేశారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. ఐదు ఏండ్ల కింద తెలంగాణ ఎట్ల ఉండే..ఇప్పుడు ఏట్ల ఉందన్నారు. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. అప్పటి రోజులు గుర్తుకువస్తే ఏడుపు వస్తది. కరెంట్ కోతలు, ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోవడం వంటివి కళ్లార చూసిన. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడన్న కరెంట్ కోత ఉందా..ట్రాన్స్ ఫార్మర్ లు ఖళిపోతున్నాయా అని ప్రశ్నించారు. భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నెం1 ప్లేస్ ఉంది. ఇది నేను చెప్పుతలేనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆనాడు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే 30ఏళ్లు పట్టేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ 4ఏళ్లలో పూర్తి చేశామన్నారు. మరో ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు.

కాళేశ్వరం పూర్తయితే నాలుగు అమృతధారలు వస్తాయి. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్, వరంగల్, నల్లగొండకు నీళ్లొస్తాయి. మానేరు నది 180 కిలోమీటర్ల పొడవుంది. 180 కిలోమీటర్ల మొత్తానికి మొత్తం సజీవ జల దృశ్యంలాగా రాబోయే ఏడాది కాలంలో కనిపిస్తది. రాబోయే నాలుగైదు నెలల్లో 260 కిలోమీటర్ల మేర గోదావరి జీవధారగా మారుతుంది. కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ను నింపనున్నాం. కాళేశ్వరంలో తరగని జల సంపద ఉంది. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రెండు పంటలకు నీరందిస్తాం. 250 కిమీ మేర గోదావరి ఒక సముద్రంలా కనిపిస్తదన్నారు.

- Advertisement -