కేసీఆర్ మీద తిట్లు – దేవుళ్ల మీద ఒట్లు!

19
- Advertisement -

కేసీఆర్ మీద తిట్లు – దేవుళ్ల మీద ఒట్లు ఇది తప్ప ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్..అర్భక ముఖ్యమంత్రి – బ్లండర్స్..పాలసీ ఫార్మేషన్ లేదు అన్నారు. అమూల్య సమయాన్ని చిల్లర రాజకీయాలకు వాడారు!..శాసనసభ వేదికగా శ్వేత పత్రాలు – నీచమైన భాషతో ప్రతిపక్షాన్ని ఏదో చేస్తాం అని ఉదరగొట్టారు అన్నారు.

వాళ్ల తప్పే వాళ్లను కాటేస్తుంది..పార్లమెంటు ఎన్నికల్లో వెల్లువ లాగా ముంచేస్తాయన్నారు. రాహుల్ గాంధీ సభ అట్టర్ ఫ్లాప్ – అభాసుపాలు,ఇబ్బడి ముబ్బడిగా ఖాళీ కుర్చీలు,అసెంబ్లీ జోష్ కొరవడిందన్నారు.రాష్ట్రం దివాళా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పారు..రాక్షసానందం! అక్కసు వెళ్లగక్కడానికి మాత్రమేనన్నారు.రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతం,కాలయాపన – భంగపాటు,వైఎస్ ప్రభుత్వం తెచ్చిన సీఎంఆర్ఎఫ్, ఫీజు రీయింబర్స్మెంట్ లు కొనసాగాయన్నారు.

ప్రభుత్వాలు నడపాలి అంటే ఔన్నత్యం ఉండాలి, ప్రభుత్వాలు కొనసాగింపుగా సాగాలి,పాత స్కీంలను తీసేసే పిచ్చి ప్రయత్నాలు చేయలేదు అన్నారు. అతి తెలివికి పోయి దెబ్బ కొట్టుకున్నారు,వాళ్ల కాళ్లు వాళ్లే నరుక్కున్నారు,గతంలో దేశంలోనే రికార్డు స్థాయిలో అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేశామన్నారు.ఇప్పుడు రోజు 7, 8 సార్లు పవర్ పోతుంది,ఊర్లో దిక్కూ దివాణం లేదు,రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు! పాము కాట్లు మళ్లీ మొదలయ్యాయి,పిండి గిర్నీ స్థాయి నుంచి హెలికాప్టర్ తయారు చేసే కంపెనీల వరకు ప్రభావం ఉంటదన్నారు. అమెజాన్ లాంటి బడా సంస్థలు కూడా ఇబ్బంది పడ్డారు,కట్కా బంద్ చేసినట్లే, కేసీఆర్ తరవాత కరెంటు పోయిందన్నారు.

మొన్న వర్షం పడితే 7 గంటలు, 8 గంటలు, 24 గంటలు కరెంట్ కట్,కొన్ని పెట్టుబడులు పెట్టి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ రీత్యా దాన్ని వివిధ గ్రిడ్లకు లింక్ చేసి పవర్ ఐలాండ్ చేసినం,కరెంట్ లేక పంటలు ఎండిపోవడం, మోటార్లు కాలిపోవడం అన్నారు. రెండున్నర లక్షల టాంకర్లు హైదరాబాదులో ఇప్పటికి అమ్ముడుపోయాయి,శుద్ధమైన జలాలు అందక బోర్ల నీళ్లు, ఉప్పునీళ్లు తాగే దుస్థితి,దీని ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో ఉంటుందన్నారు. ఒక్క సంవత్సరం నోరు గట్టుకుంటే ₹ 40 వేల కోట్లు చెల్లిస్తాం అని ఒక సీఎం మాట్లాడటం ఎంత వరకు సమంజసం అన్నారు.

Also Read:Motkupalli:రేవంత్‌తో ప్రాణ హాని!

- Advertisement -