హైడ్రా ముసుగులో అరాచకాలు: కేసీఆర్

3
- Advertisement -

అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకానితనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేళ్ల పాటు ప్రగతి పథంలో నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని, అందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసంలో జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సోమవారం నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్ చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అసెంబ్లీ, మండలిలో నిలదీయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలపై చర్చించిన కేసీఆర్, సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను అణచివేస్తుందని దుయ్యబట్టారు. లగచర్లలో మెడికల్ ఫ్యాక్టరీ పేరుతో తమ భూములు గుంజుకుంటున్నారని రోడ్ల మీదికి వచ్చిన గిరిజనులపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని, ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నివాసాలను కూలగొడుతున్నది అనేది ఎంతమాత్రం క్షమించరానిదని అన్నారు.హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలని కేసీఆర్ అన్నారు.

Also Read:మహా కుంభమేళకు 13 వేల రైళ్లు

- Advertisement -