అలంపూర్‌లో టీఆర్ఎస్‌దే గెలుపు:కేసీఆర్

215
kcr alampur
- Advertisement -

అలంపూర్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థి అబ్రహాం భారీ మెజార్టీతో గెలుస్తున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. తుంగ భద్ర జలాల్లో మన హక్కు కోసం పోరాడామని… కాంగ్రెస్, టీడీపీ మంచినీళ్లు, సాగునీరు ఇయ్యకుండా తెలంగాణను ఎండబెట్టారని తెలిపారు.

ఆర్డీఎస్ కాలువను నాశనం చేసిన దుర్మార్గులకు బుద్ది చెప్పాలంటే అబ్రహాంను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ, ఆర్డీఎస్‌ను తీసుకుని లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత నాదన్నారు. అలంపూర్‌ ఆస్పత్రిని 100 పడకలు చేస్తా. డిగ్రీ కాలేజీలు, ఫైర్ స్టేషన్ కావాలన్నరు. మూడు, నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తా. వాల్మీకి సోదరుల సమస్యలు, గిరిజనుల రిజర్వేషన్లు రానున్న రోజుల్లో సాధించుకుంటమని సీఎం స్పష్టం చేశారు.

58 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఏవిధంగా కరెంట్ ఉండేదో..ప్రస్తుతం ఎలా ఉంటుందో మీకందరికి తెలుసు. ఆసరా పెన్షన్లు 2016కు పెంచుతం. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం అమలు చేస్తున్నం. గుంట, పావు ఎకరం, అర ఎకరం, ఎకరం భూమి ఉన్న రైతుకు బీమా చేసి..ఆ రైతు చనిపోతే రైతు బీమా నుంచి రూ.5 లక్షలు నేరుగా వారికే అందజేస్తున్నామన్నారు.

- Advertisement -