KCR:తెలంగాణ వాల్లే అవమానించే పరిస్థితి?

19
- Advertisement -

తెలంగాణ వాల్లే తెలంగాణను అవమానించే పరిస్థితి వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్… రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన 25-30 మంది శాసనసభ్యులతో కనీసం 30 సార్లు సమావేశాలు పెట్టినం. ఏం చేద్దాం. మన తెలంగాణ పరిస్థితి ఇంతేనా..? మనకు నిష్కృతి లేదా అని చర్చించినం..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశారన్నారు. పది మంది కూసున్న దగ్గర కూడా తెలంగాణ అనే పదం వాడితే ఎగతాళి చేసిన పరిస్థితి అని తెలిపారు.

రాష్ట్రం రాకముందు కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు తాండవించేవని… ఆ రోజుల్లో తాను కూడా అధికార పదవుల్లో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పారు. కానీ స్వరాష్ట్రంలో అనతికాలంలోనే ఆ పరిస్థితిని అధిగమించామని చెప్పారు.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -