కేసీఆర్..కేసీఆర్..ప్రజల నుండి అనూహ్యస్పందన

27
- Advertisement -

తెలంగాణ ఒకనాడు సొంతరాష్ట్రంగా బతికిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. సూర్యాపేట రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్.. కోట్లాడి తెచ్చుకుని ఎవరి ఊహలకు కూడా అందకుండా రాష్ట్రాన్ని బాగుచేసుకున్నాం అన్నారు. తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రాంతాల్లో చెరువులు నీళ్లులేక నాడు ఎండేవి…మనం వచ్చినంక ఈ ప్రాంతంలో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చుకున్నామన్నారు. అభివృద్ధి చేసుకున్నాం…జిల్లా తెచ్చుకున్నాం… సద్దుల చెరువు ముద్దుల చెరువుగా చేసుకున్నాం అన్నారు కేసీఆర్.

తండాలను పంచాయితీలను చేసుకున్నాం.. దళిత బంధు ఇచ్చుకున్నాం,మనం కేవలం1.8 శాతం ఓట్లతో మాత్రమే..ఓడినం అన్నారు. కానీ అలివిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ మనలను మోసం చేసిందని..కరెంటుమాయమైందన్నారు. రైతుబంధు రైతుబీమా వుంటదో పోతదో తెల్వది…ముప్పై ఏండ్లు మూసి ముర్కి నీళ్ళు తాగించారు కాంగ్రెస్ పార్టీ నేతలు అని ఆరోపించారు. ఇప్పడివరకు 225 మంది రైతుల ఆత్మహత్యలైనాయి…పండించిన పంటలు కొనచేతగాట్లే ఈ ప్రభుత్వానికి
..డిసెంబర్ 9 నాడు రొండు లక్షలు మాఫీ అన్నడు చేసిండా..? అని ప్రశ్నించారు.

సీఆర్ ముడ్డి మీద చెడ్డీ గుంజుకుంటా అంటాండు ఈ సీఎం ఎంజెసుకుంటాడు షెడ్డి కొంచపోయి ?,తెలంగాణ ను విముక్తి చేసిన కేసీఆర్ ను ఇన్ని మాటలు అనొచ్చునా ? ఆలోచించాలన్నారు. నేను సచ్చినా పరవాలేదు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలే…పాలోళ్ల నడుమనో పడనోని నడుమనో అన్యాయం చేసినోని తోనో ఊల్లె పంచాతి పడితే పెద్దమనిషిని కోరుకుంటారు కదా…అట్లనే ఇయ్యాల హామీలు ఇచ్చి ఎగ్గొడుతున్న కాంగ్రెస్ తోని తెలంగాణ ప్రజలకు పంచాతి వచ్చింది.. మరి ఎవరు తెంపాలే కదా ఈ పంచతి.. మరి మీ తరఫున కొట్లాడే పెద్దమనిషి ఎవరు..?ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సాధించాలంటే లోక్‌సభకు పంపించాలన్నారు.

Also Read:బీజేపీ వ‌స్తే ఇవే చివ‌రి ఎన్నిక‌లు…

- Advertisement -