ఆరోగ్య రంగంలో అద్భుత విజ‌యాలు..

84
kcr cm
- Advertisement -

ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత విజ‌యాలు సాధించిందన్నారు సీఎం కేసీఆర్. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఆరోగ్య రంగంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాలన్నారు. 2014 కంటే ముందు ఐదు కాలేజీలు మాత్ర‌మే ఉండే. కొత్త‌గా 12 కాలేజీలు మంజూరు చేశాం అన్నారు.

అనేక రంగాల్లో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. రాజ‌కీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రుల‌ను తిట్టిపోతారు. ఇవాళ తిట్టిపోతారు.. రేపు అవార్డులు ఇస్తారని తెలిపారు. ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు అనేక రంగాల్లో ముందంజ‌లో ఉన్నామన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన చైత‌న్యం ఉంది. అన్ని వ‌ర్గాల‌ ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ని చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం.. మెడిక‌ల్ కాలేజీల మంజూరు విష‌యంలో కేంద్రం వివ‌క్ష చూపించింది. 33 జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశాం. త్వ‌ర‌లోనే అన్ని కాలేజీలు ప్రారంభ‌మ‌వుతాయన్నారు. అన్ని మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌స్తే దాదాపు 10 వేలు కూడా దాటే అవ‌కాశం ఉంది. మ‌న విద్యార్థులు ర‌ష్యా, ఉక్రెయిన్‌కు వెళ్లే అవ‌కాశం కూడా రాదన్నారు.

- Advertisement -