KCR:అక్కరకు రాని చుట్టం బీజేపీ?

15
- Advertisement -

కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టాలు, నష్టాలను ఎదుర్కొని తెలంగాణను సాధించామన్నారు మాజీ సీఎం కేసీఆర్. నాగర్‌ కర్నూల్ రోడ్ షోలో మాట్లాడిన కేసీఆర్…తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపామని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీగా తెలంగాణ సాధించానని గుర్తు చేశారు. కులం,మతం,జాతి లేదు అన్ని వర్గాలను చేరదీసి అభివృద్ధి చేశామన్నారు. యువత ఆలోచించి ఓటు వేయాలన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. ఇవాళ చాలా గొప్ప రోజు…బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అన్నారు. బీఆర్ఎస్ పుట్టి మహాసముద్రమైందన్నారు.బీఆర్ఎస్ పాలనలో మహబూబ్‌నగర్ పచ్చబడిందన్నారు. కానీ ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. రోజుకు 10 సార్లు కరెంట్ పోతుందన్నారు. మన కోసం తండ్లాడే బీఆర్ఎస్ కావాలా?, మన బతుకులు ఆగం చేసిన వారు కావాలా?ఆలోచించాలన్నారు.

రైతుబంధు వచ్చిందా?, ప్రతి ఆడపిల్లకు రూ.2500 వచ్చింది?,రైతు రుణమాఫీ జరిగిందా?ఆడపిల్లలకు స్కూటి ఇచ్చారా?, అన్ని బోగస్ హామీలతో అందరిని మోసం చేశారని మండిపడ్డారు. రైతుల ధాన్యాన్ని కొనే దిక్కుకూడా లేదన్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా 24 గంటల కరెంట్ ఇస్తే, కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 225 మంది రైతులు చనిపోయారన్నారు.మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ఎట్లుండే…ఇప్పుడు ఎట్లుందో ఆలోచించాలన్నారు. పాలమూరు నుండి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టమన్నారు. సబ్ కా సాత్ వికాస్ బోగస్ అన్నారు. ధరలు పెరుగుతుంటే సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదన్నారు. మేకిన్ ఇండియా,స్టార్టప్ ఇండియా అంతా ఉట్టిదే అన్నారు. రైతుల ఆదాయం పెరిగిందా, సామాన్యుల బ్రతకులు మారాయా ఆలోచించాలన్నారు. ఒక్క మంచి పని చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలన్నారు.ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలన్నారు. బీజేపీకి పొరపాటున ఒక్క ఓటు వేసిన రైతుల మోటర్లకు మీటర్లు పెడుతారన్నారు.

Also Read:కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్..

- Advertisement -