KCR:కేంద్రం చేతుల్లోకి సాగర్

33
- Advertisement -

కేంద్రం చేతుల్లో నాగార్జునసాగర్‌ని పెట్టిన దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు అని మండిపడ్డారు కేసీఆర్. బస్సుయాత్రలో భాగంగి మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్..కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు.

నాలుగైదు నెలల కిందట ధీమాగా ఉన్న రైతు ఈ రోజు దిగాలుపడి చాలా బాధలో ఉన్నాడన్నారు. ఆ నాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. ఈ జిల్లాల్లో మంత్రులున్నారు. ఇరిగేషన్‌ మినిస్టర్‌ స్వయంగా ఇక్కడ ఉన్నడు. వీళ్లు దద్దమ్మల్లా పోయి నాగార్జునసాగర్‌ కట్టపై కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడుతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నడు ఇది ఎంతవరకు సమంజసం అన్నారు. ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయచేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? అన్నారు. బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ వడ్లు కొన అని మొండి కేస్తే.. ముఖ్యమంత్రితో సహా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేసి.. నరేంద్ర మోడీ మెడలు వంచి.. మా తెలంగాణ పండిస్తుందన్నారు.

Also Read:బీజేపీ వ‌స్తే ఇవే చివ‌రి ఎన్నిక‌లు…

- Advertisement -